SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మంపాటి కార్తీక (8) అనే చిన్నారి ఇంటి పక్కన నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లను తాకడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే వైరాలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే తండ్రిని కోల్పోయిన కార్తీక కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.