SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్).
ఈ రోజు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద విజయకుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్
మాట్లాడుతూ….. దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ప్రాణాలనే త్యాగం చేసిన మహనీయులు భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని, దేశ చరిత్రలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ…. దేశ అభివృద్ధి, ప్రజాసేవ, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసినగొప్ప నాయకుడు, ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేసిన త్యాగశీలి రాజీవ్ గాంధీ అని అన్నారు.