TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందుతులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు.
మంగళవారం టేకులపల్లి వంతెన వద్ద ఎస్సై వి. రమేష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీల్లో చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకోని విచారించగా గత కొంతకాలం నుండి ఖమ్మంలో రెండు మోటార్ సైకిల్, రెండు ఆటోలు దొంగిలించినట్లు తెలిపారు. వీటి విలువ సుమారుగా 3,30,000 ఉంటుందని తెలిపారు.
నిందితులు ఖమ్మం పెద్ద తండాకు చెందిన ఆటో డ్రైవర్లైన నునావత్ సాయికుమార్, బానోత్ సాయికుమార్, వియం బంజరకు చెందిన రేపల్లి శ్రీను @రాజు ఇతని పై గతంలో కూడా ఖమ్మం ఒకటవ టౌన్ పరిధిలో రెండు దొంగతనాలు చేశాడని తెలిసిందన్నారు. రెండు ఆటోలు, రెండు మోటార్ సైకిల్ ను స్వాధీనపరచుకొని వారిని అరెస్టు చేసి కోర్టు నందు హాజరు పరిచినట్లు తెలిపారు.