TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. సత్తుపల్లి పట్టణం, సింగరేణి పి.ఓ ఆఫీస్ రోడ్ లోని వెంగలరావు కాలనీలో ప్రమాదవశాత్తు ఇల్లు పూర్తిగా దగ్ధమైన నిరుపేద కుటుంబానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ అండగా నిలిచారు.

మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వెంగలరావు కాలనీకి చెందిన షేక్ బీబీ, రెహమాన్ ల ఇల్లు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఉన్న నిత్యావసరాలు, సామాన్లు అన్నీ బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేకపోవడం, తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్ దంపతులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, బాసటగా నిలిచారు. తక్షణ సాయంగా ₹5,000 (ఐదు వేల రూపాయల) నగదు అందించారు. నిత్యవసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ నివాసానికి అవసరమైన దుప్పట్లు, గిన్నెలు, ప్లేట్లు అందజేశారు.


బాధిత కుటుంబానికి శాశ్వత నివాసం కల్పించేందుకు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు చొరవ తీసుకున్నారు. సత్తుపల్లి ఎం.ఆర్.ఓ (MRO), మున్సిపల్ కమిషనర్ లతో ఫోన్ లో మాట్లాడి, నిబంధనల ప్రకారం షేక్ బీబీ కుటుంబానికికి తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *