TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.సత్తుపల్లి జెవిఆర్ డిగ్రీ కాలేజీ పైన 95 లక్షలు రూపాయలు నిధులతో నిర్మించిన నూతన ఆడిటోరియంను సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. అంతరం జెవిఆర్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటుచేసిన స్వర్ణోత్సవ సన్నాహక సమావేశంలో పూర్వ విద్యార్థుల తో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జెవిఆర్ డిగ్రీ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులతో కలసి త్వరలో జరగబోయే స్వర్ణోత్సవాల కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దపతులు మాట్లాడుతూ… జెవిఆర్ డిగ్రీ కాలేజ్ ని సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన మన రాష్ట్ర మాజీ ముఖ్య దివంగత మంత్రివర్యులు శ్రీ సర్దార్ జలగం వెంగళరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని, త్వరలో జరగబోయే స్వర్ణోత్సవాల కార్యక్రమాన్ని అందరూ కలిసి జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో ప్రభుత్వ అధికారులు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా , వైస్ చైర్మన్ బొంతు సుమలత, సత్తుపల్లి ఎఎంసి చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్ 17 మంది, నాయకులు ఇమ్మనేని ప్రసాద్ రావు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుబ్బారెడ్డి, సినియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు.