TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్.
ఈ కార్యక్రమంలో వ్యవసాయం, నీటిపారుదల, పంచాయతీరాజ్, అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించామని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా అధికారులకు అవసరమైన సూచనలు చేశామని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ తెలియచేశారు.
ఈ సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.