TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఖమ్మం వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం 51 మంది లబ్ధిదారులకు రూ. 16,16,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను తుంబూరు దయాకర్ రెడ్డి చేతుల మీదుగ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ… నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందిస్తూ భరోసా కల్పిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, ఆయా ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.