సత్తుపల్లి టౌన్, జూన్ 5 (TV6 24/7 NEWS):ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ శుక్రవారం పట్టణంలోని జెవిఆర్ పార్క్లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. చెట్లు మనకు ప్రాణవాయువును అందించడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ప్రకృతిని కాపాడడం ద్వారా మాత్రమే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని, పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు.
మరిన్నితాజా వార్తల కోసం https://tv624-7news.in/ఫాలో అవ్వండి.