సత్తుపల్లి పట్టణం, జూన్06 (TV6 24/7 NEWS): సత్తుపల్లి పట్టణం, ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలోఎమ్మెల్యే రాగమయి దయానంద్ 51 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
సత్తుపల్లి మండలానికి చెందిన 22 మంది లబ్ధిదారులకు 8,51,500/- రూపాయలు విలువ గల చెక్కులు, వేంసూరు మండలానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు 9,18,500/- రూపాయలు విలువ గల చెక్కులను ఎంఎల్ఏ రాగమయి దయానంద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి, సత్తుపల్లి,వేంసూరు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.