TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్, జూన్ 16. ప్రజాభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ని పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దుదిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తో పాటు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఉన్నారు.

అలాగే ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్ తదితర ఉన్నతాధికారులు భట్టి విక్రమార్కని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయురారోగ్యాలతో పాటు ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *