TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, సత్తుపల్లి టౌన్, జూన్16. సత్తుపల్లి పట్టణం, ఎన్టీఆర్ నగర్, ZPHS స్కూల్ లో బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణి చేసిన….. సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతుల మాటల్లోని ప్రధానాంశాలు.
➡️ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి విద్యా, వైద్యం, వ్యవసాయం కు మొదటి ప్రాధాన్యత ఇస్తూన్నారు.
➡️ మేము సత్తుపల్లి నియోజకవర్గం లో గెలిచిన నాటి నుండి పాఠశాలలు, కాలేజీ లు, హాస్టల్స్ లు పరిశీలిస్తూ విద్య పై సమయం కేటాయిస్తూ ప్రభుత్వ సహాయం కాకుండా మా ఆషా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.
➡️ పాఠశాలలు తెరిచిన రోజు నుండే విద్యార్థులకు బుక్స్, పుస్తకాలు, యూనిఫామ్ లు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.
➡️ చదువు అన్నా చదువుకునే వారు అన్న మాకు ఎంతో ఇష్టం…. ఈరోజు మనం చదువుకున్న చదువు రేపటి మన కుటుంబానికి, సమాజాన్ని కాపాడుతుంది… చదువే రేపటి మన ఆస్థి, గౌరవం, జీవితం.
➡️ విద్యార్థిని, విద్యార్థుల భవిష్యత్ కోసం నిరంతరం అన్ని విధాలా కష్ట పడి పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్ కు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.
➡️ విద్యార్థులకు అల్పాహారం, పాలు కూడా అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంకు ధన్యవాదములు తెలియజేస్తున్నాం.
➡️ విద్యార్థులను అందరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంఇఒ రాజేశ్వరావు, ప్రిన్సిపల్ రామ్మోహన్, మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, సత్తుపల్లి ఎఎంసి చైర్మన్ దోమ ఆనంద్, యుపిఎస్ స్కూల్ ప్రిన్సిపల్ శైలజ, ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్, ఎన్టీఆర్ నగర్ స్కూల్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, కౌన్సిలర్స్ శరత్ చంద్ర, జగ్గానాధం శ్రీను, నాసిమ షరీఫ్, విద్యార్థినీ విద్యార్థులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ నగర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.