రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2026-27) డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27వ తేదీ నుంచి పాలిసెట్ (POLYCET) కౌన్సెలింగ్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది.

టీజీ పాలిసెట్ ఫలితాలు ఎప్పుడంటే..?

ఈ ఏడాది మే 13వ తేదీన పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే… ఈ నెల 23వ తేదీ లోపు పరీక్ష ఫలితాలు అధికారులు వెల్లడించనున్నారు. ఈసారి ముందే కౌన్సిలింగ్ షెడ్యూల్ అధికారులు ప్రకటించారు. ఇది విద్యార్థులకు మంచి అవకాశం.

టిజి పాలిటెక్నిక్ ఫలితాలు ఎక్కడ చూడాలి?

https://www.polycet.sbtet.telangana.gov.in/ వెబ్సైట్లో విద్యార్థులు చూసుకోవచ్చు.

టీజీ పాలిసెట్ 2026 – తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ : టీజీ పాలిసెట్ పాసైన విద్యార్థులు మొదటి విడత కౌన్సెలింగ్ మే 27 నుంచి జూన్ మొదటి వారంలో అవకాశాలు ఉన్నాయి. మే 27 నుండి 31 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ లో ఫీజు చెల్లించి, ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. తొలి విడత కౌన్సెలింగ్ మే 27 నుంచి ప్రారంభం కానుంది.

మే 27–31 : ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్
మే 29–జూన్ 1 : సర్టిఫికెట్ వెరిఫికేషన్
మే 29–జూన్ 3 : వెబ్ ఆప్షన్లు
జూన్ 6 : తొలి విడత సీట్ల కేటాయింపు
జూన్ 6–9 : ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్
జూన్ 8–9 : కాలేజీల్లో రిపోర్టింగ్
జూన్ 9 : తరగతుల ప్రారంభం

మిగిలిన సీట్ల కోసం జూన్ 15 నుంచి చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్లకు కూడా అవకాశం కల్పించనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *