డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ సూచనలతో స్పందించిన కాంగ్రెస్ నాయకులు

పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని లింగగూడెం పీటీ రోడ్డు నుంచి స్మశాన వాటిక సమీపం వరకు ఉన్న ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతలను కాంగ్రెస్ నాయకులు పూడ్చించారు.

ఈ రహదారి రా తోనే చెరువు ఆయకట్టు రైతులకు, స్మశాన వాటికకు వచ్చిపోయే ప్రజలకు ప్రధాన మార్గంగా ఉంది. రహదారిపై గుంతలు ఏర్పడటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సూచనల మేరకు పెనుబల్లి కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణ కమిటీ నాయకులు తక్షణమే స్పందించారు.

కాంగ్రెస్ నాయకులు మద్దెల దుర్గారావు తన జేసీబీ సేవలను ఉచితంగా అందించి రహదారిపై ఉన్న గుంతలను పూడ్చే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డి శ్రీనివాస్ గుంతల పూడ్చివేత పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తన సహాయ సహకారాలు అందించారు.

ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ నాయకులు ముందుకు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *