పెనుబల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని వినతి.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. పెనుబల్లి 18 : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేయడంతో పాటు, కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

శనివారం రాత్రి అన్నపురెడ్డి శ్రీనివాస్ (ASR), జిల్లెల్ల శ్రీనివాస్ (JSR) ఆధ్వర్యంలో గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు దయానంద్ విజయ్ కుమార్ ను కలిసి పెనుబల్లి గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామంలో గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిజమైన అర్హులకు ఇళ్లు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు. అలాగే గ్రామంలో దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలపై దృష్టి సారించి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ విజ్ఞప్తులపై డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ సానుకూలంగా స్పందించినట్లు ASR తెలిపారు. గ్రామ అభివృద్ధి, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అంశాలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించి నిజమేనా లబ్ధిదారులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *