హాజరైన ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. సత్తుపల్లి, అక్టోబర్ 17: సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామంలో శనివారం ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి, సత్తుపల్లి శాసనసభ్యురాలు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.

అనంతరం యాతాలకుంట గ్రామ పరిధిలో కొనసాగుతున్న సీతారామ ప్రాజెక్ట్ టన్నెల్ పనులను ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డిలతో పాటు మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *