TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, వరంగల్ టౌన్, జూన్ 18. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హనుమకొండకు చెందిన అరుదైన డీఎన్డీ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ను పరామర్శించారు. తనను కలవాలన్న నిరంజన్ కోరికను గౌరవించి స్వయంగా అతని ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్, అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరంజన్ తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చుల కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందించి, శ్రీ వెంకటేశ్వరస్వామి తీర్థప్రసాదాలు అందజేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నిరంజన్‌తో ఆప్యాయంగా గడిపిన పవన్ కళ్యాణ్ అతని అభిమానం చూసి భావోద్వేగానికి గురయ్యారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తానని తెలిపారు. కుటుంబ జీవనోపాధి కోసం క్యాంటీన్ ఏర్పాటు చేసేలా జనసేన తెలంగాణ నాయకులకు సూచించారు. అనంతరం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.