TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 18 తలసేమియాతో పోరాడుతున్న పిల్లలకు మేమున్నామంటూ.. సహాయం చేయడానికి ఖమ్మం టౌన్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏసీపీ రమణమూర్తి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 100 మందిపైగా దాతల నుంచి రక్తం సేకరించి తలసేమియా బాధితులకు అందజేశారు.

ఈ సందర్బంగా ఏసీపీ రమణమూర్తి మాట్లాడుతూ.. యువత రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి సందర్భాల్లో రక్తదానం చేయడం అలవాటుగా చేసుకోవాలన్నారు. దాతలు తక్కువ కావడం వల్లే అవసరాలకు సరిపడా రక్తం లేక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.

స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఏసిపి రమణమూర్తి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు కరుణాకర్, బాలకృష్ణ, మోహన్ బాబు, ఉస్మాన్ షరీఫ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *