TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఉపాధి హామీ కూలీల ఫేస్ అటెండెన్స్ ని నేషనల్ మొబైల్ మోనిటరింగ్ సిస్టం అనే యాప్ ద్వారా అటెండెన్స్ వేస్తారు. పని చేయడానికి ముందు చేసిన తర్వాత రెండుసార్లు అటెండెన్స్ వేస్తారు.
అయితే ఉపాధి హామీ పనికి వెళ్లే ఓ కూలీకి పెద్ద సమస్య వచ్చి పడింది. అతను గుండు చేయించుకోవడంతో యాప్ లో అటెండెన్స్ అతని ముఖం సరిపోవడం లేదు. దీంతో తోటి కూలీలు చిన్న ఉపాయంతో ఆ వ్యక్తికి వచ్చిన సమస్యను పరిష్కారం చూపారు.
అదేమిటంటే గుండు చేయించుకున్న వ్యక్తి కూర్చోవడంతో, పొడవాటి జుట్టు ఉన్న మహిళ ఆ వ్యక్తి పక్కన కూర్చొని తన పొడవాటి జుట్టును అతను గుండెపై వేసింది దాంతోఉపాధి హామీ యాప్ లో అటెండెన్స్ పడి సమస్య సులభంగా పరిష్కారం అయింది. అయితే ఇది ఉపాధి హామీ కూలీలు అటెండెన్స్ యాప్ తో వాళ్లు పడే చిక్కులకు ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. సిగ్నల్ లేక తెల్లవారుజామున సరైన లైటింగ్ లేక, సర్వర్ బిజీ ఇలా అనేక సమస్యలను ఫేస్ యాప్ తో ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్నారు.