TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, అన్నపురెడ్డిపల్లి మండలం, జూన్ 19. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు.
ఈ తనిఖీల్లో పోలీసులు 88 కేజీల గంజాయి, ఒక కారు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.