TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, జూన్ 17. పెనుబల్లి మండల కేంద్రంలోని యాసారపు విజయలక్ష్మి భర్త పిచ్చయ్య అనే మహిళ తను పెంచిన కొడుకు తనను కొట్టి ఇంటిలో నుంచి తనకు సంబంచిన సామాన్లు మొత్తం రోడ్డుపై పడవేసి తన ఇంటిలోంచి గెంటివేశాడని ఆరోపించింది.

గత కొన్ని నెలల క్రితం తన భర్త పిచ్చయ్య చనిపోయాడని, అప్పటినుంచి పెంచిన కొడుకు, కన్న కొడుకు ఆస్తి కోరకు గొడవలు పడుతున్నారని, విజయలక్ష్మి ఆరోపించారు. దీనిలో భాగంగానే పెంచిన కొడుకు తనను, తన సామాన్లను ఇంటి నుంచి బయట పడి వేశాడని, అప్పటినుంచి బంధువులు ఇంట్లో తల దాసుకుంటున్నానని తెలియజేసింది. అధికారులు, గ్రామ పెద్దలు తనకు న్యాయం చేయాలని తాను బ్రతికున్నంత వరకు తన ఆస్తిపాస్తులు తానే అనుభవించే విధంగా కొడుకులిద్దరికీ నచ్చ చెప్పాలని కోరుకుంటుంది..

ఈ సందర్భంగా విజయలక్ష్మి కన్నా కొడుకు రామకృష్ణ మాట్లాడుతూ తన తల్లికి అన్యాయం జరుగుతుందని, ఆమె బ్రతికున్నంత కాలం ఆమెకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఆమే అనుభవించాలని, ఆమె తదనంతరం పెద్ద మనుషులు చెప్పిన మాట ప్రకారం తన నడుచుకుంటానని తెలియజేశాడు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *