SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో సోషల్ మీడియా రీల్స్, లైకుల కోసం బహిరంగ రహదారులపై ప్రమాదకర బైక్ స్టంట్లు చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
టాస్క్ ఫోర్స్, కూసుమంచి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన చర్యల్లో మాదవరుపు శివ రామకృష్ణ (20), బానోత్ జశ్వంత్ (18)లను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే స్టంట్లు, రేసింగ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ప్రజల భద్రతకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే, స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని సోషల్ మీడియా పోలీసు బృందం విజ్ఞప్తి చేశారు. మోటారు వాహన చట్టం ప్రకారం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రేసింగ్ చేస్తే జైలు శిక్ష, భారీ జరిమానాలు పడే అవకాశం ఉందన్నారు.