SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం – ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను ఖమ్మం అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా నల్లపాడు గ్రామానికి చెందిన పట్నాల వెంకట దుర్గ ప్రభు @ అఖిల్ (29) అనే వ్యక్తి జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తూ, నంబర్ ప్లేట్ లేని బైక్‌పై చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నాడు. శుక్రవారం ఖమ్మం శ్రీరాంనగర్‌లో ఒక మహిళ మెడలో చైన్ లాక్కొని పారిపోతూ ఉండగా కేసు నమోదు చేశారు.

విచారణలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కూడా ఇతనిపై చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *