ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో సోమవారం సాయంత్రం విఎం బంజర్ – కొత్తగూడెం జాతీయ రహదారిపై రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరగగా నలుగురికి గాయాలయ్యాయి.

ఒకటి పెనుబల్లి ఉప్పలచలక కస్తూరిబా స్కూలు సమీపంలో ద్విచక్ర వాహనం, లారీ ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో సత్తుపల్లి కి చెందిన ఇస్లావతి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కుడి మోకాలకు తీవ్ర గాయాలయ్యాయి… మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. వెంకటేశ్వరరావు ఎర్రగుంట హాస్పిటల్ లో డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహించి సత్తుపల్లి వెళుతూ ఉండగా ప్రమాదం జరిగినది.

రెండవ రోడ్డు ప్రమాదం రంగారావు బంజరలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో యం లీలసాయి (మార్కాపురం గ్రామం ఖంభం మండలం) గౌరిశెట్టి రాఘవులు (ఎడవల్లి, లింగపాలెం మండలం.) పదం రామకృష్ణ (కరాలపాడు పెనుబల్లి మండలం). గాయపడ్డారు.

గోద్రెజ్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ అన్నపురెడ్డిపల్లిలో నిర్వహిస్తున్న నర్సరీలో సాయిలీల, రాఘవులు పనిచేస్తున్నారు. అనపరెడ్డిపల్లి నుండి వైరా మండలం అంజనాపురంలోని నర్సిని విజిట్ చేసి తిరిగి అన్నపురెడ్డిపల్లి లీలాసాయి, రాఘవులు జుపిటర్ పై వెళుతూ ఉండగా, చండ్రుగొండ వెళ్లి స్వగ్రామం కర్రలపాడు పద్దం రామకృష్ణ తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా రంగారావు బంజరలో ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *