SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంటల సాగు ప్రణాళిక ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ఖమ్మం సుందరయ్య భవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా సాగు ప్రణాళిక లేకపోవడంతో రైతులు తమకు తోచిన పంటలు సాగు చేస్తున్నారని అన్నారు.

భూమి సారం, నీటి వనరులు, వాతావరణ పరిస్థితులు, ధరలు, నిల్వ సౌకర్యాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లా వారీగా పంటల ప్రణాళిక రూపొందించాలని కోరారు. రబీ సీజన్‌లో వరి, మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మద్దతు ధర పెంపు తక్కువగా ఉండగా, ఎరువులు, డీజిల్ ధరలు భారీగా పెరగడం రైతులకు భారమైందన్నారు. రైతులు మద్దతు ధర కోసం చేపట్టే నిరసనల్లో పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వాసిరెడ్డి ప్రసాద్, ఎస్ కె మీరా దుగ్గి కృష్ణ, ఇంజం నాగభూషణం, బొంతు సమత, నల్లమోతు మోహన్ రావు,ప్రతాప్ నేని వెంకటేశ్వరరావు, తోట వెంకటరెడ్డి, కందుల భాస్కర్ రావు, మల్లెంపాటి రామారావు, గుండ్ల వెంకటేశ్వరరావు,వజ్జా రామారావు, తోటకూర వెంకట నరసయ్య, చిలకల వెంకటేశ్వర్లు, కొమ్మినేని నాగేశ్వరరావు, బిగ రమేష్, మాదాల వెంకటేశ్వరరావు, కుసుపూడి మధు, ఐనాల రామలింగేశ్వరరావు,వలూరు శ్రీనివాసరావు మడుపల్లి కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *