SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లిలో రూ.4.02 కోట్లతో చేపట్టనున్న 3.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఇప్పటికే ప్రాంతంలో రూ.9 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కూసుమంచి మండలం నర్సింహులగూడెం నుంచి గోప తండా వరకు రూ.7.15 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. తండాల ప్రజల రవాణా కష్టాలను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం సంక్షేమంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, రుణమాఫీ, సన్నబియ్యం బోనస్ వంటి పథకాలు కొనసాగుతాయని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ , కమిషనర్ శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *