SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్).అక్రమ రవాణా జరగకుండా పూర్తిస్థాయిలో కట్టడి చేయడానికి చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదిట్టం చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కల్లూరు డివిజన్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. సరిహద్దు నుండి ఇసుక అక్రమంగా రవాణా చేసే వాహనాలపై (ట్రాక్టర్లు, టిప్పర్లు) చట్టపరమైన కేసులు నమోదు చేసి సీజ్ చేయాలన్నారు. గంజాయి రవాణాను అడ్డుకోవడానికి స్థానిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. అదేవిదంగా రేషన్ బియ్యం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు లేదా మిల్లులకు తరలకుండా గోదాములు, వాహనాలపై నిఘా పెంచి, కఠినమైన కేసులు నమోదు చేయాలన్నారు.
అక్రమ రవాణాకు పాల్పడే వారిపై నాన్-బైలబుల్ కేసులు పీడీ యాక్ట్ అమలు చేయాలన్నారు.పండుగల సమయంలో చట్టవిరుద్ధంగా పశువుల రవాణా, వధింపులు జరగకుండా జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద వాహనాల విస్తృత తనిఖీలు చేయన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం, సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచడం చాల కీలకమన్నారు.
ఈ సమావేశంలో ఏసీపీ వసుంధర యాదవ్, ఏసీపీ సాంబరాజు, సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తులింగం,ఇన్స్పెక్టర్ శ్రీహరి, సర్వయ్య, ఎస్సై లు పాల్గొన్నారు.