SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). సత్తుపల్లి పట్టణం -ఎంఎల్ఎ క్యాంప్ కార్యాలయంలో సత్తుపల్లి మున్సిపాలిటీకు చెందిన 12 మంది సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 4,74,500 రూపాయలు విలువ గల చెక్కులు శనివారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి ఎఎంసి చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్ నాయకులు పాల్గొన్నారు.