SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). సత్తుపల్లి మండలం – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి ఆదేశాలు మేరకు సోమవారం సత్తుపల్లి మండలం లోని రుద్రాక్షపల్లి గ్రామంలో, సత్యం పేట గ్రామంలో, గౌరీగూడెం గ్రామంలో నూతన స్త్రీ శక్తి భవనాలకు సత్తుపల్లి ఎఎంసి చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి ఎపిఎం జ్యోతి, భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సత్తుపల్లి ఎఎంసి చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి ఎపిఎం జ్యోతి, సిసి లు, సెక్రటరీ లు, రుద్రాక్షపల్లి, గౌరీగూడెం సర్పంచ్ లు… ఉప సర్పంచ్ లు, వార్డు నెంబర్స్, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

పెనుబల్లి మండలం – మండలపాడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామ పంచాయతీలో స్వయం సహాయక బృందాల గ్రామ సంఘ మహిళా సంఘ భవన నిర్మాణానికి సోమవారం సర్పంచ్ గాయం రమేష్ శంఖుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ జెఇ రమేష్, మహిళా సంఘం సిసి నాగ చెన్నారావు, పెనుబల్లి మండల సమాఖ్య అధ్యక్షురాలు మనీషా, ఫీల్డ్ అసిస్టెంట్ యడవల్లి సుబ్బారావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంచినీళ్లు వేంకటేశ్వరరావు, తోట నాగేశ్వరరావు, పెండ్ర ఆదినారాయణ, యడవల్లి వెంకట చిన్నోడు, స్థానిక మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *