అశ్వారావుపేట మండలం , జూన్7 (TV6 24/7 NEWS): అశ్వారావుపేట మండలం మద్దికొండ (భీమునిగూడెం) గ్రామానికి చెందిన 15వ బెటాలియన్‌ గంగారంలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తాటి నాగార్జున గారు బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఈ రోజు అకాల మరణం చెందడం అత్యంత బాధాకరమని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు.

ఈ సందర్భంగా నాగార్జున భౌతికకాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. నాగార్జున కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ధైర్యం చెప్పారు. నాగార్జున పోలీస్ శాఖలో విధులు నిర్వహించడమే కాకుండా స్వగ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ నిరుపేదలకు అండగా నిలిచేవారని ఎమ్మెల్యే జరె గుర్తుచేశారు. గ్రామ యువతకు విద్య ఉపాధి వ్యక్తిత్వ వికాస విషయాలలో మార్గనిర్దేశం చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *