సత్తపల్లి మండలం, జూన్ 10 (TV6 24/7 NEWS):సత్తుపల్లి పట్టణం – వేశ్యకాంతుల చెరువు – సత్తుపల్లి పట్టణం, వేశ్యకాంతుల చెరువు ప్రాంతం లో సర్వే చేసి ప్రభుత్వ భూమి ని గుర్తించాలి అని సత్తుపల్లి రెవిన్యూ అధికారులను ఆదేశించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.
మంగళవారం మంత్రి పొంగలిటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద దంపతులతో కలిసి వేసే కాంతుల చెరువు ప్రాంతాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని యుద్ద ప్రాతిపదికన సర్వే చేసి గుర్తించాలని, ప్రభుత్వ భూమిని గుర్తించి అట్టి భూములను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భూమి లేని పేద ప్రజలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో అందించే దిశగా కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమం లో రెవిన్యూ అధికారులు,సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, రైతులు, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.