పెనుబల్లి మండలం, జూన్09 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని వి.ఎం. బంజర పీఎం శ్రీ జిల్లా పరిషత్ హై స్కూల్ పదో తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాల విద్యార్థులు 95 శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారు.

ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయని పేర్కొన్నారు.

అలాగే, కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కొనసాగుతున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ హైస్కూల్‌లో చేర్పించాలని కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *