పెనుబల్లి మండలం, జూన్09 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని వి.ఎం. బంజర పీఎం శ్రీ జిల్లా పరిషత్ హై స్కూల్ పదో తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాల విద్యార్థులు 95 శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారు.
ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయని పేర్కొన్నారు.
అలాగే, కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కొనసాగుతున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ హైస్కూల్లో చేర్పించాలని కోరారు.