సత్తపల్లి మండలం, జూన్ 10 (TV6 24/7 NEWS):సత్తుపల్లి పట్టణం – వేశ్యకాంతుల చెరువు – సత్తుపల్లి పట్టణం, వేశ్యకాంతుల చెరువు ప్రాంతం లో సర్వే చేసి ప్రభుత్వ భూమి ని గుర్తించాలి అని సత్తుపల్లి రెవిన్యూ అధికారులను ఆదేశించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.

మంగళవారం మంత్రి పొంగలిటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద దంపతులతో కలిసి వేసే కాంతుల చెరువు ప్రాంతాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని యుద్ద ప్రాతిపదికన సర్వే  చేసి గుర్తించాలని, ప్రభుత్వ భూమిని గుర్తించి అట్టి భూములను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భూమి లేని పేద ప్రజలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో అందించే దిశగా కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమం లో రెవిన్యూ అధికారులు,సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, రైతులు, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *