పెనుబల్లి మండలం, జూన్ 11 (TV6 24/7 NEWS):ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామంలో బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు.  పెనుబల్లి గ్రామం నుండి లింగగూడెం వెళుతున్న క్రమంలో  రోడ్డుపై ఉన్న గేదెను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు ఉన్నట్లుగా  సమాచారం. 

ప్రమాదంలోపెనుబల్లి మండలం లింగగూడెం గ్రామానికి చెందిన పద్దం విష్ణు,  ములకలపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందిన మీడియం శివ మరణించగా లింగగూడెం గ్రామానికి చెందిన ఇరప గోపాలరావు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో పాడి గేద కూడా మరణించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం చేయాల్సి ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *