ఖమ్మం టౌన్, జూన్ 11 (TV6 24/7 NEWS):ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలన, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన ర్యాలీ   నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీఅడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన అడిషనల్ డిసిపి రామానుజం మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ యువత, విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం, రవాణాకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. గంజాయి వల్ల వ్యక్తిగతంగా, సామాజికంగా కలిగే నష్టాలను గుర్తించి, వాటి నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వైద్యులు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించగా, గంజాయి నిర్మూలన ప్రతిజ్ఞ కూడా చేశారు.

ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్ కరుణాకర్, బాలకృష్ణ, హాస్పిటల్ సూపరిండెంట్, పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *