TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, అశ్వారావుపేట, జూన్ 16. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) లో ప్రభుత్వ వైద్యులతో వర్షాకాల సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై సమీక్ష సమావేశం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారి ఆదినారాయణ మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వైరల్ జ్వరాలు నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, పరీక్షా కిట్లు, పడకలు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గ్రామాలు, కాలనీల్లో పారిశుధ్య కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జ్వర లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు,
మందుల నిల్వలపై వివరాలు తెలుసుకొని డాక్టర్లకు, సిబ్బందికి సలహాలు సూచనలు ఇచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *