TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, జూన్ 19. పెనుబల్లి మండలం రామచంద్రపురంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. రామచంద్రపురం అటవీ ప్రాంతంలో విద్యార్థినిలతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలని, భావితరాలకు పచ్చని వాతావరణాన్ని అందించడం మన అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి తాసిల్దార్ బద్రు నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్లు,మండల కాంగ్రెస్ నాయకులు షేక్ కరీముల్లా, ప్రజలు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.