తల్లాడ మండలం , జూన్7 (TV6 24/7 NEWS):  తల్లాడ మండలంలోని తెలగవరం గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఆదివారం విచ్చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కు భారీ కాన్వాయ్‌తో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ…. పేద వారి సొంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన నిరుపేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి పేద కుటుంబానికి సురక్షితమైన నివాసం అవసరమని, అందుకే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మా రెడ్డి,మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *