పెనుబల్లి మండలం, జూన్ 07 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన కోమటి జ్యోతి కృష్ణారావు ఇటీవల సత్తుపల్లి నియోజకవర్గం ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షురాలుగా నియమించబడ్డారు.
ఆదివారం పెనుబల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులు జ్యోతి కృష్ణారావును బయ్యన్నగూడెం వారి ఇంటి వద్ద అభినందనల తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జ్యోతి కృష్ణారావు మాట్లాడుతూ నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు జరగటం చాలా దురదృష్టకరమని అన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గం ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షురాలుగా తనను నియమించడం చాలా సంతోషంగా ఉందని, తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట కొరకు చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చామని ఇకముందు గ్రామస్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని, నియోజకవర్గంలోని టిడిపి కార్యకర్తలు అభిమానులు నాయకులు ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు తనకు వారి సహాయ సహకారాలు అందించాలని కోరారు.