సత్తుపల్లి టౌన్, జూన్ 08 (TV6 24/7 NEWS):సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించనున్న క్రిస్టియన్ భవన్కు ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ దంపతులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్రైస్తవ సోదర సోదరీమణుల సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ భవనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, క్రైస్తవ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మత పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు.