లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాగమయే దయానంద్.
పెనుబల్లి మండలం, జూన్09 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెనుబల్లి మండలానికి చెందిన 39 మంది లబ్ధిదారులకు రూ.10,33,500 విలువైన సిఎంఆరైఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ…. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాల వారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తినప్పుడు ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించాలని లక్ష్యంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని, అలాగే ఆరోగ్యశ్రీ కూడా పది లక్షలకు పెంచడం జరిగిందని ఎమ్మెల్యే రాగమయి దయనంద్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అద్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, ఎఎంసి వైస్ ఛైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు రాధాకృష్ణ ,సర్పంచ్ ల సంఘం ఉపాధ్యక్షుడు గాయం రమేష్ ,మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.