వెబ్ న్యూస్ – మే 14/26). రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ…. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి కరుణాకటాక్షాలతో, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశీస్సులతో నేను ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు.
అన్ని పార్టీలలోని ప్రతి ఒక్కరూ మా తుమ్మల అని చెప్పుకునే పరిస్థితికి నన్ను తీసుకు వచ్చినటువంటి ప్రజలకు నమస్కారాలు అంటూ… భావోద్వేగానికి లోనై మంత్రి తుమ్మల కన్నీరు పెట్టుకుంటూ తన ప్రసంగాన్ని ముగించారు.