వెబ్ న్యూస్ – మే 15/26 తెలంగాణ రాష్ట్రంలో ఫీజిక్స్, కెమిస్ట్రీ, బొటనీ, జువాలజీలో ఇకపై మొదటి సంవత్సరం నుంచే ప్రాక్టికల్స్. ఫస్ట్ ఇయర్‌లో 15 మార్కులు, సెకండ్ ఇయర్‌లో 15 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు. మ్యాథ్స్‌లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ప్రవేశపెట్టిన ఇంటర్ బోర్డు. మొదటి, రెండో సంవత్సరాల్లో ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు ఒక్కో ఏడాదికి 15 మార్కులు. మ్యాథమేటిక్స్ ఫైనల్ పరీక్షలు ఇకపై 75 మార్కులకు బదులు 60 మార్కులకు నిర్వహణ.
హ్యుమానిటీస్‌లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు 20 మార్కులు. హ్యుమానిటీస్ ఫైనల్ పరీక్షలు 100కి బదులు 80 మార్కులకు నిర్వహణ. భాషా విభాగాల్లోనూ 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు, 20 మార్కులు ఇంటర్నల్ అసెస్‌మెంట్. రాష్ట్ర జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు మే 12 నుంచే ప్రారంభం. ‘ACE’ (అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) పేరుతో కొత్త గ్రూప్ ప్రవేశపెట్టిన బోర్డు. MEC విద్యార్థుల కోసం ప్రత్యేక గణిత ప్రశ్నపత్రం రూపొందించనున్న ఇంటర్ బోర్డు.