SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). రాబోయే బక్రీద్‌ పండుగను పురస్కరించుకొని శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలఖమ్మం జిల్లా సిపి సునీల్ దత్త్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని సరిహద్దు కేంద్రాల వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రాబోయే బక్రీద్‌ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా సరిహద్దు చెక్పోస్టుల వద్ద తనిఖీలు సిపి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

దీనిలో భాగంగా వేంసూరు మండలం హనుమతండా చెక్‌పోస్ట్ వద్ద వేంసూరు ఎస్సై కవిత సోమవారం వాహనాలను తనిఖీ చేశారు. చింతకాని మండలం బస్వపురం రోడ్డు చెక్ పోస్టులో ఎస్సై వీరేందర్ తనిఖీలు నిర్వహించారు.

బక్రీద్ పండుగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పశువుల అక్రమ రవాణాపై 24/7 నిఘా ఉంటుందన్నారు. పశువులను రవాణా చేసేటప్పుడు సరైన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండటం తప్పనిసరి అని, అక్రమ పశు రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసిన తక్షణమే పోలీసులకు తెలియజేయాలని, ఏ పరిస్థితుల్లోనూ పశువుల అక్రమ రవాణా చేసే నిందితులపై ప్రత్యక్ష దాడులకు పాల్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని ఖమ్మం జిల్లా సిపి సునీల్ దత్త్ ఇటీవల ఏర్పాటుచేసిన సమావేశంలో స్పష్టంగా తెలియజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *