SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం, విఎం బంజర్ రింగ్ సెంటర్ లో జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటం ముందు కేక్ కట్ చేసి అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, బ్రెడ్డు పంపిణీ చేశారు. విఎం బంజర్ బస్టాండ్ లో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు.