SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, సీపీఎం పార్టీ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్లో సిపిఎం నాయకులు తాండ్ర రాజేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సిపిఎం నాయకులు చలమాల విట్టల్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విఠల్ రావు మాట్లాడుతూ రెండుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపీగా గెలిచినా కామ్రేడ్ సుందరయ్య పొర్టమెంటుకు సైకిల్ మీద వెళ్లేవారని, అటువంటి మహానాయకుడు ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *