SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). పెనుబల్లి మండలం పరిధిలోని ముత్తగూడెం గ్రామానికి చెందిన ఓ ఎలక్ట్రికల్ షాప్ నిర్వహించుకుంటున్న యువకుడు ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. ఫేస్బుక్లో వచ్చిన పతంజలి ప్రకటనను నమ్మి PLC టాబ్లెట్స్ ( చెవిటి మిషన్) ఆర్డర్ చేసిన బాధితుడికి, అడ్రస్ తప్పుగా ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి భయపెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. భయపడినఆ యువకుడు పలుమార్లు ఫోన్‌పే ద్వారా మొత్తంగా రూ.76 వేలును బదిలీ చేశాడు. అనంతరం మోసపోయానని గుర్తించిన బాధితుడు వి.ఎం. బంజర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐవెంకటేష్ కేసు నమోదు చేసిన ఎస్ఐ దర్యాప్తు చేపట్టారు.