SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశామని, వైరా ఏసీపీ సారంగపాణి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మృతురాలు కల్పన (28) మే 15న విధులకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరి కనిపించకుండా పోయింది. అనంతరం కృష్ణాపురం సమీపంలోని నక్షత్ర ఓపెన్ వెంచర్ ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యమైంది.
దర్యాప్తులో యార్లగడ్డ అంకుశరావు @ చెన్నారావు అనే వ్యక్తితో మృతురాలికి సన్నిహిత సంబంధం ఉన్నట్లు తేలింది. ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో కోపంతో నిందితుడు చున్నీతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
మధిర పోలీసులు, టెక్నాలజీ ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకుని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.