SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్).
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన సీఎం, దేశాన్ని కంప్యూటర్ మరియు టెలికాం యుగం వైపు నడిపించిన మహానేతగా ఆయనను కొనియాడారు.
మహిళా సాధికారత కోసం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకువచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. అలాగే లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎటువంటి చిక్కుముడులో లేకుండా మళ్లీ ప్రవేశపెట్టాలని ప్రధాని
నరేంద్ర మోడీని కోరారు. తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని సీఎం గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, సలహాదారు వి హనుమంతరావు గారితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.