SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్) – మొక్కజొన్న, జొన్న పంటలను పిఎస్ఎస్ స్కీంలో చేర్చాలి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి PMRKVY-PDMC మరియు MIDH పథకాల కింద ఉద్యానశాఖకు నిధుల కేటాయింపులు చేయాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కలిసిన మంత్రి తుమ్మల కోరారు.
ఈ రబీ సీజన్ కు సంబంధించిన పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని 3,690 మెట్రిక్ టన్నుల నుండి 15,262 మెట్రిక్ టన్నులకు పెంచాలని,2 పామాయిల్ పై ఉన్న దిగుమతి సుంకాన్ని పెంచేలా సంబంధిత మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని మంత్రి తుమ్మల కోరగా, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సానుకూలంగా స్పందించి త్వరలోనే సమగ్ర సమీక్ష నిర్వహించి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు .